ఈ ఒక్క ఫోన్ కొంటే ఏడాదంతా ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ 4జీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్!!

సెల్ ఫోన్ వచ్చిన కొత్తల్లో మైక్రోమ్యాక్స్ మొబైల్ చేతిలో ఉన్న వారికి సొసైటీలో స్టేటస్ వేరు. ఎన్నో ప్రత్యేకతలతో చాలా కాలం రారాజుగా వెలుగొందిన మైక్రోమ్యాక్స్ తర్వాత పోటీ సంస్థల ధాటికి పూర్తిగా వెనుకబడింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైన ఈ దేశవాళీ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్ త‌న పాత వెర్ష‌న్ కాన్వాస్‌ను స‌రికొత్త‌గా మార్కెట్లోకి తెస్తోంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 పేరుతో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. 

ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ సెల్ ఫోన్ తో ఎయిర్ టెల్ జత కట్టింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2 మొబైల్ కొన్న‌వారికి ఆఫ‌ర్ కింద ఒక ఏడాదిపాటు ఉచితంగా 4జీ డేటా అందివ్వడంతో పాటు ఏ మొబైల్ నెట్‌వ‌ర్కుకైనా అప‌రిమిత కాల్స్ చేసుకోవ‌చ్చ‌ని మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ కూడా ఉంటుంది. మే 17నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 ధ‌ర రూ.12వేలు గా వెల్లడించింది. దాని ప్రత్యేక ఫీచర్లు ఇలా ఉన్నాయి..

మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌-2 స్పెసిఫికేష‌న్స్‌
* డిస్‌ప్లే: 5 ఇంచెస్‌
* ప్రాసెస‌ర్ : 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్‌కోర్
* ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సెల్‌
* బ్యాక్ కెమెరా : 13 మెగా పిక్సెల్‌
* రిజ‌ల్యూష‌న్ : 720*1280 పిక్సెల్స్‌
* ర్యామ్ : 3జీబీ
* ఓఎస్ : ఆండ్రాయిడ్ 7.0
* స్టోరేజ్ : 16 జీబీ
* బ్యాట‌రీ కెపాసిటీ : 3050 ఎమ్ఏహెచ్‌
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top