దూసుకొస్తున్న జియో బంపర్ ఆఫర్లు… ఎదుర్కోవడం కష్టమే…

ఇప్పటికే జియో ఇచ్చే ఆపర్లతో తెలీకాం రంగం వణికిపోతుంది. ఇప్పుడు జియో FTTH బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించిన బేటా ట్రెయిల్స్‌ను అన్ని ప్రధాన నగరాలకు వస్తుందని జియో ప్రకటించింది. ఇప్పుడు జియో లాంచ్ చేయబోయే కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్సులు కూడా FTTH కేబులింగ్ ద్వారానే వర్క్ అవుతాయని తెలుస్తోంది. జామ్ నగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగుల ఇళ్లలో కొన్ని సెట్ టాప్ బాక్సులను ఇన్ స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టెస్టింగ్ ఫేజ్‌లో వాడుతోన్న హైబ్రీడ్ సెట్ టాప్ బాక్సులు కొరియాలో తయారైనట్లు తెలుస్తోంది.

వాటిలో స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్, ఆడియో, వీడియో అవుట్ పుట్ పోర్ట్స్ తో పాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన Ethernet పోర్ట్ కూడా ఉంది. జియో సెట్ టాప్ బాక్స్ ముందు భాగంలో కూడా యూఎస్బీ పోర్ట్ ను అందుబాటులో ఉంచుతుంది. సర్వీస్ ఆరంభంలో భాగంగా 300 ఛానళ్లను జియో అందుబాటులో ఉంచుతుందట. రూ. 185కే అందించేందుకు ప్లాన్ చేస్తున్నరాట. జియో డీటీహెచ్ సర్వీసులు లాంచ్ అయితే ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బ తీస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా దూసుకుపోతున్న జియో ను ఎదుర్కోవడం కష్టమే మిగిలిన కాంపిటేటర్స్ కి…
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top