ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో, డిజిటల్ కరెన్సీ ఉపయోగించమని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో, కేవలం మీ మొబైల్ తోనే, చాలా రకాల సేవలు వినియోగించుకోవచ్చు. బ్యాలన్స్ తెలుసుకోవడం, మినీ స్టేట్మెంట్, ఒక ఎకౌంటు నుంచి ఇంకో ఎకౌంటు కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్‌నెట్‌తో కూడా పనిలేదు. ఏ రకమైన GSM ఫోనుల్లో అయినా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి *99#కు డయల్ చేస్తే చాలు. ఇప్పటివరకు 51బ్యాంకులు ఈ సర్వీస్ లో ఉన్నాయి.
*99# విశేషాలు
ఈ సర్వీస్ ఉపయోగించాలి అంటే, ఇంటర్నెట్ కు సంబంధం లేదు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు.
అన్ని టెలికాం సర్వీసులు నుంచి, ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
అన్ని రకాల GSM మొబైల్ ఫోన్స్ లో ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
ఈ సర్వీస్ మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా 24/7 ఉపయోగించవచ్చు
ఏ రకమైన యాప్ మీ ఫోనులో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు
మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉండాలి
మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, వాళ్ళ మొబైల్ నెంబర్, ఆదార్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నెంబర్, MMID నెంబర్, IFSC కోడ్ మొదలైనవి మీ దగ్గర ఉంచుకోండి.
*99# ఏ రకమైన సర్వీసులు చెయ్యవచ్చు
ఫండ్స్ ట్రాన్స్ఫర్
ఎకౌంటు బ్యాలన్స్
మినీ స్టేట్మెంట్
వన్ టైం పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
మీ బ్యాంకు ఎకౌంటు ఆదార్ తో లింక్ అయ్యిందో లేదో, తెలుసుకోవటానికి
ముందుగా ఏమి చెయ్యాలి
బ్యాంక్ అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి *99#కు డయల్ చెయ్యాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోతే, మీ బ్యాంకుకి వెళ్లి, రిజిస్టర్ చేసుకోవాలి.


