పెళ్లి కూతురిని గంపలో ఎందుకు తీసుకువస్తారు?

Pelli Butta :మన హిందూ సంప్రదాయంలో పెళ్ళికూతురుని గంపలో కూర్చోపెట్టి మేనమామలు పెళ్లి మండపం వద్దకు తీసుకురావటం ఆచారంగా ఉంది. ఈ విధంగా ఎందుకు తీసుకువస్తారో మనలో చాలా మందికి తెలియదు. కానీ దీని వెనక గొప్ప పరమార్ధం ఉంది.

ఆడపిల్ల పుట్టగానే ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందని అంటారు. అలాగే సిరి సంపదలు వారి వల్లే కలిగాయని నమ్ముతారు. ఆడపిల్లను అత్తవారింటికి పంపటం అంటే సిరి సంపదలను వారి ఇంటికి పంపడం అని అర్ధం. సంపదలను ఇచ్చే తల్లి లక్ష్మి దేవి. అటువంటి లక్ష్మి దేవి తామర పువ్వులో ఉంటుంది. అంటే పెళ్ళికూతురుని తీసుకువచ్చే గంప తామర పువ్వు అని అర్ధం. శ్రీ మహాలక్ష్మిని తామరపువ్వులో పెట్టి ఇస్తున్నాం అని వరుడికి చెప్పటానికి....పెళ్లి సమయంలో పెళ్ళికూతురును గంపలో తీసుకువస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top