ఎన్టీఆర్ గురించి తెలియని షాకింగ్ రహస్యాలు

NTR Life Details :విశ్వ విఖ్యాత నట సర్వబౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఈ తరం వారికీ చాలా తక్కువగా తెలుసు. అయన సినీ రంగంలోనూ,రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేసారు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఆశ్చర్య కరమైన,ఆసక్తి కరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ విజయవాడలో ఇంటర్ మిడియేట్ చదువుకొనే రోజుల్లో కుటుంబ అవసరాల కోసం పాలను హోటల్స్ కి సరఫరా చేసేవారు.

విజయవాడలో చదువుకొనే సమయంలోనే ముఖానికి రంగు వేసుకొని మొదటిసారిగా స్త్రీ వేషం వేసారు.

ఎన్టీఆర్ 1949 లో వచ్చిన 'మన దేశం' సినీ రంగానికి పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమాలో పోషించిన పొలీస్ పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేనిది.

1963 లో విడుదల అయిన 'బృహన్నల' సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కూచిపూడి డాన్స్ బేసిక్స్ ని నేర్చుకున్నారు.

ఎన్టీఆర్ ఒకే సినిమాలో రాముడు,రావణాసురుడు పాత్రలను పోషించి అభిమానులు మరియు విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నారు.

ఎన్టీఆర్ తన కెరీర్ లో దాదాపుగా 17 హిందూ దేవుళ్ళ గెటప్ లను వేసారు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే భావన ప్రేక్షకుల్లో వచ్చేసింది.

ఎన్టీఆర్ హీరోగా మంచి స్థితిలో ఉన్నప్పుడే బేనర్ స్థాపించి సినిమాలకు దర్శకత్వం, నిర్మాణ సారధ్య బాధ్యతలను తీసుకున్నారు.

ఎన్టీఆర్ తన కెరీర్ లో మూడు నేషనల్ అవార్డ్ లను గెలుచుకున్నారు. అయితే అవి నటుడిగా రాలేదు. అందులో ఒకటి దర్శకత్వనికి,మిగిలిన రెండు నిర్మాతగా వచ్చాయి.

ఇక రాజకీయ జీవితానికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేసారు. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అయన నడిచిన విధానం చాలా మందికి ఆదర్శం అయ్యింది.

ఎన్టీఆర్ 1968 లో 'పద్మ శ్రీ' అవార్డ్ ని కేంద్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top