మాస్ మహారాజ్ గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Ravi Teja


తెలుగులో మినిమమ్ గ్యారెంటి హీరోగా పేరుతెచ్చుకున్న రవితేజను అభిమానులు ముద్దుగా మాస్ మహారాజ్ పిలుచుకుంటారు.

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవి శంకర రాజు. రవితేజ జనవరి 26,1968 లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో జగ్గం పేటలో జన్మించాడు.

రవితేజ తండ్రి భూపతిరాజు రాజ్ గోపాల్ రాజు, తల్లి లక్ష్మి. రవితేజకి భరత్, రఘునాద్ రాజ్ అనే ఇద్దరూ తమ్ముళ్ళు ఉన్నారు.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు రవితేజ జైపూర్,డిల్లీ, ముంబై వంటి నగరాల్లో నివసించాడు. ఆ తర్వాత విజయవాడకు కుటుంబంతో వచ్చి సిద్దర్ద్ కాలేజిలో బ్యాచలర్ డిగ్రీ ని పూర్తి చేసాడు.

రవితేజ మే 26,2002 లో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంనకు చెందిన కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. రవితేజకు మోక్షద,మన్నిత్ అనే ఇద్దరు పిల్లలు.

తన తండ్రి ఉద్యోగ రిత్యా బదిలీల కారణంగా రవితేజ దాదాపుగా తన బాల్యం మొత్తం ఉత్తర భారతదేశంలో గడిపాడు.

చిన్నతనం నుండి అమితాబ్ అభిమాని కావటంతో, చిన్నతనం నుండి రవితేజ నటన మీద అమితమైన ఆసక్తితో ఉండేవాడు.

రవితేజ 11 సంవత్సరాల వయస్సులో అమితాబ్ వలే హీరో కావాలని జైపూర్ నుంచి ముంబై పారిపోయాడు. అయితే అతని ప్రయత్నాలను కుటుంబ సభ్యులు నిరోదించారు.

సినిమాల్లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి, చిన్న చిన్న పాత్రలను వేసుకుంటూ, ఆ తర్వాత క్రమంగా హీరోగా ఎదిగాడు.

కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'నిన్నే పెళ్ళడతా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆ సినిమాలో చిన్న పాత్రను పోషించాడు. ఆ తర్వాత కృష్ణ వంశీ తీసిన 'సిందూరం' సినిమాలో లీడ్ రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేసిన, ఆ తర్వాత ఒక రేంజ్ హీరోగా మారాడు. ఎనర్జీ అంటే రవితేజ...రవితేజ అంటే ఎనర్జీ అనే లెవల్ కి ఎదిగాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top