బరువు పెరగాలని అనుకుంటున్నారా?


Weight Loss Tips In Telugu :స్త్రీలలో ఎక్కువ మంది అధిక బరువుతో బాధ పడుతూ ఉంటే,మరికొందరూ ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువుతో సన్నగా,పీలగా ఉండి నలుగురిలో కలవటానికి అత్మన్యున్యత భావంతో బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలను చూద్దాము.

సాదారణంగా బరువు సమస్య వంశపర్యంపర్యంగా వస్తుంది. తల్లి,తండ్రి ఇద్దరూ సన్నగా ఉంటే వారి పిల్లలు కూడా చాలా వరకు సన్నగా,బరువు తక్కువగా ఉంటారు. అలాగే ఊబకాయంతో బాధపడే వారి పిల్లల్లో కూడా ఈ వారసత్వం వస్తుంది. కొందరికి కాళ్ళు,చేతులు తరచూ అటు ఇటు కదిలించటం అలవాటు ఉంటుంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపించే గుణం. ఇది పెద్దైన తరువాత కూడా ఉంటే కనుక వీరు బరువు పెరగటం కష్టం.

బరువు తగ్గాలని అనుకునే వారు,పెరగాలని అనుకునే వారు కూడా ముందుగా దృష్టి పెట్టాల్సింది ఆహారం మీదే. బరువు పెరగాలని అనుకునే వారు 70 శాతం అదనంగా కేలరీలను తీసుకోవాలి. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న బంగాళాదుంపలు,పిస్తాలు,బియ్యం మెనులో ఉండేలా చూసుకోవాలి.

రోజు మొత్తంలో రెండు,మూడు సార్లు అధిక మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అన్ని సార్లు పక్కన స్నాక్స్ ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో భారీ టిఫిన్ తో పాటు పళ్ళరసాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం అనేది బరువు తగ్గించటానికి,బరువు పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top