ఎసిడిటి ఉపశమనం కొరకు చిట్కాలు

acidity home remedies In Telugu :కడుపులో మంట,కడుపులో నొప్పి ఇవన్నీ ఎసిడిటి లక్షణాలే. అసలు ఎసిడిటి ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్దాలు,ఉత్పత్తులు పడకపోతే ఎసిడిటి వస్తుందని అందరికి తెలిసిన విషయమే. 
ఎసిడిటి అనిపించినప్పుడు మందుల కన్నా ఆహారంలో మార్పులు,చేర్పులు చేసుకుంటే దాని నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకుంటూనే ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ అల్లంపొడి,చిటికెడు ఇంగువ పొడి,చిటికెడు రాళ్ల ఉప్పు బాగా కలిపి త్రాగితే ఎసిడిటి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గోరువెచ్చని నీటితో కొద్దిగా అల్లం పొడి,చిటికెడు మిరియాల పొడి, మూడు,నాలుగు యాలకులు దంచి పొడి చేసి కలిపి త్రాగితే మంచిది.

ఒకటి,రెండు స్పూన్స్ నీటిలో ఇంగువ పొడి వేసి ముద్దగా చేసి మంట లేదా నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఈ విధంగా రెండు,మూడు రోజులు చేస్తే నొప్పి,మంట తగ్గిపోతాయి.

భోజనం చేయగానే చిన్న అల్లం ముక్కను నమలటం అలవాటు చేసుకుంటే ఎసిడిటి రాకుండా తప్పించుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి త్రాగాలి. ప్రతిరోజూ రెండుసార్లు ఈ విధంగా త్రాగినట్లయితే కడుపునొప్పి తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top