Coriander Seeds: ఒక స్పూన్ ధనియాలు చాలు... శరీరంలో పేరుకుపోయిన చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది

Coriander Seeds benefits in telugu :మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో ధనియాలు ఒకటి. మనం వంటలలో ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ధనియాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

సీజన్ మారినప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ ధనియాలు, చిటికెడు పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. 

ఈ విధంగా తాగటం వలన ప్రేగుల్లో  పురుగులు,నులి పురుగులు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వేసవిలో వచ్చే డిహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. అజీర్ణ సమస్యలకు దివ్య ఔషధమని చెప్పవచ్చు. 

అజీర్ణ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, కడుపునొప్పి ఉన్నప్పుడు ఈ కాషాయం తాగితే మంచి ఫలితం కనబడుతుంది. అంతేకాక శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Share on Google Plus