Telugu Kitchen Tips : అరస్పూను సాంబ్రాణి, కొద్దిగా గవ్వపలుకు తీసుకుని దాన్ని యాబై గ్రాముల నువ్వుల నూనెలో వేసి బాగా కాచి, చల్లార్చి ప్రతిరోజు మూడు పూటలా అరికాలిమీద రాస్తుంటే అరికాలి మంటలు తగ్గుతాయి.
బిర్యానీ లేదా రొట్టెలతో పాటు కొందరికి చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు కూడా ఉండాల్సిందే. కానీ వాటిని అప్పటికప్పుడు తరిగి వడ్డించుకంటే మరీ ఘాటుగా ఉండి అంతగా తినలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఉల్లిపాయల్ని చక్రాల్లా తరిగి ఓ పాత్రలోకి తీసుకోవాలి. అవి మునిగేలా నీళ్లు పోసి ఆ తరవాత రెండుమూడు ఐసుముక్కలు వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక ఆ నీళ్లు వంపేసి ప్లేటులోకి తీసుకుంటే తక్కువ ఘాటుతో కరకరలాడే ఉల్లిపాయ ముక్కలు సిద్ధం.
గ్రేవీ తెల్లగా రావాలంటే.. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలను మెత్తగా ముద్ద చేసి వేస్తే సరిపోతుంది.