ప్రతి రోజు గుప్పెడు వాల్ నట్స్ ని స్నాక్స్ రూపంలో గాని, భోజనంలో గాని కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాలిఫోర్నియా యునివర్సిటి పరిశోదకులు జరిపిన పరిశోదనల్లో తెలిసింది. ఇరవై మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ కి వాల్ నట్స్ ఇవ్వకుండా, మరో గ్రూప్ కి ప్రతి రోజు 13 గ్రాముల వాల్ నట్స్ ని స్నాక్స్ రూపంలో ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత వీరి మెదడును పరిశీలన చేయగా, వాల్ నట్స్ తినని వారి మెదడులో ఎటువంటి మార్పు కనపడలేదు.
వాల్ నట్స్ తిన్నా వారిలో అంతకు ముందు కన్నా జ్ఞాపకశక్తి పెరగటంతో పాటు గతంలో కన్నా మెదడు చురుగ్గా పనిచేయటాన్ని కూడా గమనించారు. ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని, 2030 నాటికీ ఈ సంఖ్య రెట్టింపు అవ్వవచ్చని పరిశోదకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి నుంచి తప్పించుకోవటానికి, మెదడు చురుగ్గా పనిచేయటానికి వాల్ నట్స్ సహాయపడతాయని పరిశోదకులు అంటున్నారు.