మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్

Mahesh Babu Movies :సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు. మహేష్ బాబు 'రాకుమారుడు' సినిమా తో ప్రారంభించి మొన్న విడుదల అయ్యిన 'బ్రహ్మోత్సవం' సినిమాతో 22 సినిమాలు చేసాడు. ఈ 22 సినిమాల్లో 11 సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా సరే ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ స్టార్ హీరోల రేసులో ముందుంటాడు. ఇప్పుడు ఆ ప్లాప్ సినిమాల గురించి తెలుసుకుందాం.

1. వంశీ
బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను మహేష్ బాబాయి ఆదిశేష గిరిరావు నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ తో రోమాన్స్ చేసిన నమ్రతను మహేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2. టక్కరి దొంగ
ఈ సినిమాలో మహేష్ కౌబాయ్ గెటప్ లో కనిపించి అభిమానులకు కనువిందు చేసాడు. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశ పరచి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకు జయంత్ సి. పరాంజి దర్శక నిర్మాతగా వ్యవహరించారు.

3. బాబి శోభన్ దర్శకత్వంలో కృష్ణ మోహన రావు నిర్మాణంలో వచ్చిన బాబి తీవ్రమైన నిరాశను కలిగించింది.

4. నిజం
ఈ సినిమా మహేష్ కి ఎన్నో అవార్డ్ లను తెచ్చిపెట్టింది. తేజ దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

5. నాని
ఎస్. జె.సూర్య దర్శకత్వంలో మంజుల నిర్మించిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది.

6. సైనికుడు
ఒక్కడు తర్వాత మహేష్ బాబు,గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వని దత్ నిర్మించాడు.

7. అతిధి
యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు.

8. ఖలేజా
అతడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

9. నేనొక్కడినే
సుకుమార్,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానులనే కాకుండా మహేష్ బాబుకి కూడా షాక్ ఇచ్చింది.

10. ఆగడు
నేనొక్కడినే సినిమా ప్లాప్ తర్వాత శ్రీను వైట్ల మీద నమ్మకంతో చేసిన 'ఆగడు' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

11. బ్రహ్మోత్సవం
పివిపి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తే, అది వారికీ కనెక్ట్ కాలేక ప్లాప్ సినిమాగా నిలిచింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top