మష్రుమ్స్ - 200 గ్రాములు
ఉల్లి కాడల తురుము - ఒక కప్పు
బాస్మతి బియ్యం - పావు కిలో
మిరియాల పొడి - ఒక స్పూన్
పచ్చిమిర్చి తురుము - పావు కప్పు
ఉప్పు - తగినంత
నూనె - 5 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర - ఒక కట్ట
చైనీస్ సాల్ట్ - చిటికెడు
తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి అన్నం ఉడికించి పక్కన పెట్టాలి. మష్రుమ్స్ ని సగానికి కోసి ఉడికించాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత ఉల్లి కాడల తురుము,మిరియాల పొడి వేయాలి. ఇవి కొంచెం వేగాక ఉడికించిన మష్రుమ్స్ వేయాలి. అవి వేగాక అన్నం వేసి తగినంత ఉప్పు,చైనీస్ సాల్ట్ వేసి కలిపి,చివరగా కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే మష్రుమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.....