పౌండేషన్ ఎలా ఎంపిక చేసుకోవాలి?

మేకప్ అందంగా,ఆకర్షనీయంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన ప్రాధమిక విషయాలపై అవగాహన ఉండాలి. వాటిలో పౌండేషన్ ఎంపిక ముఖ్యమైనది. పింక్ టోన్ పౌండేషన్ ని ఎప్పుడు వాడకూడదు. భారతీయ మహిళలకు ఎల్లో బేస్డ్ కలర్ పౌండేషన్ బాగా నప్పతమే కాకా సహజంగా కన్పిస్తుంది. పౌండేషన్ ని ఎప్పుడు పగటి సమయంలోనే కొనాలి. 

సూర్య రశ్మి వెలుతురులో మాత్రమే మీ స్కిన్ టోన్ కి సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది. రెండు మూడు షేడ్స్ పౌండేషన్స్ కలిపి మీ చర్మానికి సెట్ అవుతుందో లేదో చూసుకోవచ్చు. బుగ్గపై రాసి మీ చాయకు ఏ రకం పౌండేషన్ సరిపోతుందో చూసుకోండి. ఏ షెడ్ అయితే మీ చర్మంలో కలిసిపోతుందో అదే మీకు అనువైన పౌండేషన్ అని తెలుసుకోండి. రెండు షేడ్స్ లో ఇది ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిలో కాస్త డార్క్ గా ఉన్న దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. 

మీ చర్మ తత్వానికి, మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే విధంగా పౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. మీది పొడి చర్మం అయితే పొడి తత్వాన్ని తగ్గించి మాయిశ్చరైజర్ ఉన్న పౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. మీది జిడ్డు చర్మం అయితే మేట్ షెడ్ ని ఎంచుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top