వ్యాయామం కొద్దిసేపు చేస్తే సరిపోతుందా?

వ్యాయామం అనగానే చాలా మంది గంటల తరబడి చేయాలని భావిస్తారు. కానీ కొద్దిసేపు చేసినా సరే మంచి పలితం కనపడుతుందని...దీంతో గుండె జబ్బులు,పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుందట. మహిళల్లో శారీరక శ్రమ స్థాయిలు ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే విషయం మీద పరిశోదన చేసారు. ఈ అధ్యయనంలో సగటు 56 సంవత్సరాలు ఉన్న 10 లక్షల మంది మహిళలను ఎంచుకొని ఎంతసేపు శారీరక శ్రమ...వ్యాయామం చేస్తున్నారో పరిశీలన చేసారు. 

మొదట మూడు సంవత్సరాల తర్వాత పరిశీలన చేసి తదుపరి 10 సంవత్సరాల తర్వాత పరిశీలన చేయగా ఆసక్తికరమైన విషయం బయట పడింది. అతి తక్కువ లేదా అసలు వ్యాయామం చేయని వారితో పోలిస్తే...ఒక మాదిరిగా వ్యాయామం(వారానికి రెండు లేదా మూడు సార్లు)చేసేవారిలో గుండె జబ్బులు,పక్షవాతం ముప్పు 20 శాతం మేర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వ్యయమ ప్రయోజనాల కోసం మహిళలు గంటల తరబడి వ్యాయామం చేయవలసిన అవసరం లేదని ఈ పలితాలు చెప్పుతున్నాయని పరిశోదకులు అంటున్నారు.

కాకపోతే మధ్య వయస్సు మహిళలు మాత్రం ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ కూడా సూచిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top