చెమటతో అందం తగ్గిపోతుందా...ఇలా చేస్తే సరి


chemata kayalu in telugu :చాలా మంది కాలంతో సంబంధం లేకుండా చెమటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చెమటకారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది. కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే చెమట బారినుండి తప్పించుకోవచ్చు.

ఓట్ మీల్ చెమటను తగ్గించటమే కాకుండా చెమట రాకుండా కూడా చేస్తుంది.స్నానం చేసే నీటిలో కొంచెం ఓట్ మీల్ పౌడర్ ని వేసి స్నానం చేస్తే చెమట పొక్కులు తగ్గటమే కాకా దురద కూడా తగ్గుతుంది.

ముఖంపై వచ్చిన చెమట కాయలను తగ్గించటంలో కలబంద బాగా సహాయపడుతుంది.

కాస్త కలబంద గుజ్జును ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేపలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. దీన్ని అనేక ఎలర్జీలకు మందుగా వాడుతూ ఉంటారు. వేపను పేస్ట్ చేసి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాసి కొంత సేపు అయ్యిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వేప నూనెలో కొంచెం కర్పూరం కలిపి రాసుకున్నా సరే చెమటకాయలు తగ్గిపోతాయి.

గంధం పొడిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి రాసుకున్నా మంచి పలితం కనపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top