పాదాల మెరుపు కోసం...Best Tips

Feet Care Tips In Telugu :కాలంతో పనిలేకుండానే కొందరిని కాలి పగుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో తక్షణ పరిష్కారంగా ఇంటిలో ఉండే వస్తువులతో సులువైన ప్యాక్స్ వేసుకోవచ్చు. పగుళ్ళు తగ్గి పాదాలు అందంగా మారతాయి.

నాలుగు ఐదు ముక్కలు,ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకోని అన్నింటిని కలిపి పాదాలకు రాసుకోవాలి. తర్వాత నెమ్మదిగా సవ్య,అపసవ్య దిశలలో మర్దన చేయాలి. ఈ విధంగా పావుగంట చేసిన తర్వాత, బకెట్ లో సగం దాకా గోరువెచ్చని నీళ్ళు తీసుకోని అందులో కొద్దిగా తేనే వేసి పాదాల్ని అందులో ఉంచండి. కొంతసేపు అయ్యాక పాదాల్ని కడిగి,తుడిచి మాయీశ్చరైజర్ రాయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే పగుళ్ళు తగ్గి మృదువుగా మారతాయి.

గుప్పెడు పెసర పిండి లో ఒక స్పూన్ తేనే, కాసిని పాలు కలిపి ఆ మిశ్రమంలో కాలి మడమలు, వేళ్ళ మధ్య రుద్దాలి. పలితంగా కాలి పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.

పావుకప్పు గులాబీ రేకుల ముద్దకు ఒక స్పూన్ తేనే, రెండు అరటిపండ్ల గుజ్జును కలపాలి. దీన్ని పాదాలకు రాసుకోవాలి. పావుగంట అయ్యాక ముల్తాని మట్టి,పాలు కలిపినా ప్యాక్ ను పాదాలకు వేయాలి. పావుగంట తర్వాత కడిగేసుకుంటే అందమైన పాదాలు మీకు సొంతం అవుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top