బట్టతల సమస్య లేకుండా చేయటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగే చిట్కాలు

జుట్టు పెరుగుదల లేకపోవడం,పాక్షికంగా లేదా పూర్తిగా జుట్టు కోల్పోతే బట్ట తల వస్తుంది. పురుషులలో సుమారుగా 70 శాతం మంది బట్ట తల సమస్యతో బాధపడుతున్నారు. పురుషులలో జుట్టు ఎక్కువగా రాలిపోవటం కారణంగా బట్ట తల వస్తుంది. బట్ట తల రావటానికి వంశపారంపర్యం లేదా పురుష సెక్స్ హార్మోన్లు ప్రధాన కారణంగా ఉన్నాయి. జుట్టు రాలటం ప్రారంభం అయితే క్రమంగా జుట్టుపలుచగా తయారయ్యి తద్వారా బట్ట తలగా మారుతుంది. బట్ట తలను నివారించటానికి సమర్ధవంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

1. కొబ్బరి పాలు మరియు నూనె
బట్ట తల మరియు జుట్టు రాలటాన్ని నివారించటానికి ఉత్తమ ఇంటి పరిష్కారంగా కొబ్బరి పాలను చెప్పవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా కొబ్బరి పాలను తలకు రాస్తే మంచి పలితం కనపడుతుంది.
* ఒక బౌల్ లో 20 ml కొబ్బరి నూనె ,10 ml ఉసిరి నూనె, రెండు స్పూన్లనిమ్మరసం కలిపి తల మీద చర్మం మీద రాసి కొంత సేపు అలా వదిలేయాలి.
* అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇది చుండ్రు నివారణ మరియు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది.
* ప్రతి రోజు క్రమం తప్పకుండా జుట్టుకు పాలను రాస్తే తల మీద చర్మానికి సహజమైన పోషణను అందించటమే కాక జుట్టు కణజాలంనకు కూడా పోషణను అందిస్తుంది.

2. నూనెలతో ప్రతి రోజు మర్దన
ఉసిరి నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి నూనెలతో ప్రతి రోజు తలకు మర్దన చేస్తే జుట్టు గ్రీవమును ఉత్తేజపరిచటానికి సహాయం మరియు చుండ్రు నివారణకు సహాయపడుతుంది.

* కొంచెం నూనెను అరచేతిలోకి తీసుకోని జుట్టు మరియు తల మీద చర్మం మీద సమానంగా రాయాలి.
* తల మీద 10 నిముషాలు మసాజ్ చేసి, 15 నిముషాలు అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
* ఈ మసాజ్ ను రోజులో నాలుగు సార్లు చేస్తే బట్ట తలను నిరోదించవచ్చు.
* రాత్రి పడుకొనే ముందు కొబ్బరి నూనె లేదా ఉసిరి నూనె రాసుకొని మసాజ్చే సుకుంటే జుట్టు మూలాల్లో రక్త ప్రసరణ అభివృద్ధి మరియు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. మెంతులు మరియు నూనె
* వేగించిన కొన్ని మెంతులను కొబ్బరి నూనెలో వేసి కొన్ని నిముషాలు నానబెట్టాలి.
* ఈ మిశ్రమాన్ని తల మీద తక్కువ మొత్తంలో రాయాలి.
* తలపై సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టు మూలాలలోకి చేరుతుంది.
* ఈ విధంగా వారంలో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

4. గోరింటాకు
భారతదేశంలో గోరింటాకును చాలా కాలం నుండి జుట్టు నష్టం చికిత్సకు,జుట్టు రంగు కొరకు మరియు జుట్టు మేరవటానికి ఉపయోగిస్తున్నారు.
* ఆవాల నూనెలో గోరింటాకు వేసి మరిగించాలి.
* ఈ నూనె చల్లారిన తర్వాత ఒక సాదారణ నూనెలో కలిపి తల మీద చర్మానికి,జుట్టుకు రాయాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపితే మంచి పలితాలు వస్తాయి.
* ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే బట్ట తల నుండి బయట పడవచ్చు.

5. పెరుగు మరియు శనగపిండి
* ఒక బౌల్ తీసుకోని దానిలో రెండు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
* ఈ పేస్ట్ ని జుట్టు మరియు తల మీద చర్మం మీద రాసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
* ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. తద్వారా
బట్ట తల రాకుండా నివారిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top