Steaming Benefits: ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..?



సాదారణంగా మనం జలుబు చేసినప్పుడు మాత్రమే ఆవిరి పడతాము. కొందరు ఫేషియల్ సమయంలో స్టిమింగ్ కి ప్రాధాన్యం ఇస్తారు. నిజానికి తరచూ ఇలా చేయుట వలన చర్మానికి చాలా మంచిది. దీనితో అనేక లాభాలు ఉన్నాయి.

ఆవిరి పట్టటం వలన మూసుకున్న చర్మ గ్రంధులు తెరుచుకుంటాయి. చర్మం లోపల ఉన్న మురికి బయటకు వచ్చేస్తుంది. మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్లాక్,వైట్ హెడ్స్ కూడా క్రమంగా దూరం అవుతాయి.

మొటిమలు ఉన్నవారు తరచూ నాలుగు నుంచి అయిదు నిముషాలు ఆవిరి పట్టాలి. ఆ తర్వాత ఐస్ ముక్కలతో రుద్దుకుంటే సమస్య తొందరగా తొలగిపోతుంది. అంతేకాక అలసట,ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. శ్వాస సంభందిత సమస్యలు కూడా తగ్గుతాయి. 

తలనొప్పితో బాధ పడేవారు నీళ్ళలో లావెండర్ నూనె వేసుకొని ఆవిరి పట్టుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. సైనస్ సమస్య ఉన్నప్పుడు యుకలేప్తిస్ నూనె,జిడ్డు చర్మం ఉన్నవారు రోస్మేరి నూనె,పొడి చర్మం ఉన్నవారు పిప్పర్మేంట్ ఆయిల్ ను ఆవిరి పట్టే సమయంలో ఉపయోగించాలి.
Share on Google Plus