శ్రావణ మాసంలో ఇలా చేస్తే అదృష్టం, సకల సంపదలు,కోరిన కోరికలు తీరతాయి

Shravan month Good Luck And success


Shravan month Good Luck And success : శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో శివారాధన చేస్తే మంచి శుభాలనుఅందిస్తుంది. ఈ మాసంలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో హిందువులు ఎన్నో నోములు,వ్రతాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తారు. శ్రావణ మాసం శివునికి అనుకూలమైన మాసం. ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే చేసే పనిలో విజయం, వివాహంలో  ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి.

ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివాలయాలను దర్శించి పాలు, నీటితో శివుడికి అభిషేకం చేసి ఓ నమఃశివాయ పంచాక్షరీ
మంత్రాన్ని జపించాలి.

చెరువులు, నదులకు వెళ్లి చేపలకు గోధుమ పిండితో తయారుచేసిన ఆహారం వేస్తె ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. చేపలకు ఆహారం వేయటం అంటే శివునికి పెట్టినట్టే.

మహామృత్యుంజయ జపం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మహామృత్యుంజయ జపంను 108 సార్లు జపించాలి. శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ హోమం చేస్తే చాలా మంచిది.

వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఏమైనా ఆటంకాలు ఎదురు అయితే కుంకుమపువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివ పార్వతుల అనుగ్రహం పొంది వైవాహిక జీవితంలో ఏర్పడిన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.
Share on Google Plus