ఇంటిలో దుర్వాసన ఎక్కువగా ఉందా...అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Home Remedies for Bad Smell At Home In Telugu


Home Remedies for Bad Smell At Home In Telugu :వానాకాలం మొదలు అయింది. వానాకాలంలో బట్టలు ఆరటం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ బట్టలు సరిగా అరకపోవటం వలన ఒక రకమైన దుర్వాసన ఇంటిలో వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలలో ముఖ్యంగా నిమ్మరసం బాగా సహాయపడుతుంది. అసలు దుర్వాసన రావటానికి కారణం అయిన సూక్ష్మజీవులను నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ సమర్ధవంతంగా తరిమి కొడుతోంది. అందువల్ల దుర్వాసన పోవటానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది.

బట్టలు ఉతికి జాడించటం అయ్యాక ఆరవేయటానికి ముందు ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసంను పిండి ఆ నీటిలో ముంచి ఆరవేస్తే బట్టల నుంచి దుర్వాసన రాదు. ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఆ నీటిలో కాస్త నిమ్మరసం పిండితే ఇంటిలో దుర్వాసన కూడా మాయం అయ్యిపోతుంది.

అలాగే వెనిగర్ కూడా నిమ్మరసం వలె పనిచేస్తుంది. వెనిగర్ కి ఫంగస్ ని నిర్ములించే శక్తి ఉంది. అందువల్ల ఇంటిని శుభ్రం చేసే నీటిలో వెనిగర్ వేస్తె ఇల్లంతా దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది.

నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని దుర్వాసన వచ్చే ప్రదేశాలలో జల్లితే 5 నిమిషాల్లో దుర్వాసన మాయం అయ్యిపోతుంది.

ఉప్పును ఒక క్లాత్ లో వేసి మూటలా కట్టి ఇంటిలో దుర్వాసన వచ్చే ప్రదేశాలలో పెట్టాలి. అలాగే బట్టలు ఉన్న అరలలో పెట్టిన బట్టలకు ఉన్న తేమను ఉప్పు పీల్చుకొని దుర్వాసన రాకుండా చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top