వక్కపొడి తినే అలవాటు ఉందా...అయితే ప్రమాదంలో పడినట్టే

Chewing betel nut Side Effects In Telugu

Chewing betel nut Side Effects In Telugu : చాలా మంది వక్కపొడిని భోజనం అయ్యాక నములుతూ ఉంటారు. కొంత మంది పాన్ రూపంలో తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పాన్ తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. పాన్ లో సున్నం, తమలపాకు, యాలకులు, దాల్చినచెక్క వంటివి ఉపయోగించిన వక్కపొడి ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. వక్కపొడిని ఎక్కువగా నమలటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వక్కపొడి ఎక్కువగా నమలడం వలన నోటి క్యాన్సర్ వస్తుంది. అంతేకాక ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా జా మూవ్ మెంట్ తగ్గిపోతుంది.

వక్కపొడిని ఎక్కువగా నమలటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ కు గురి అయ్యి తద్వారా ఊబకాయం సమస్యకు గురవడానికి బలమైన బంధం ఉందని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

వక్కపొడిని నమలటం వలన గమ్ ఇరిటేషన్ తో పాటు టూత్ డీకే వంటి దంత సమస్యలు వస్తాయి. అంతేకాక రెగ్యులర్ గా వక్కపొడిని నమిలితే దంతాలు ఎరుపు రంగులోకి శాశ్వతంగా మారిపోతాయి.

వక్కపొడిని తరచూ తీసుకోవడం వలన అడిక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. వక్కపొడి అలవాటును మానటం చాలా కష్టం అయ్యిపోతుంది. వక్కపొడిని నమలడం ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వక్కపొడి అలవాటు ఉన్నవారు మానేస్తే చాలా మంచిది. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. అదే మితిమీరితే మాత్రం ప్రమాదం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top