కొన్ని వేపాకులను టీలో వేసి మరిగించి త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేపలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియాలను తరిమి కొట్టి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.
కొన్ని వేపాకులను శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి. ఒక స్పూన్ వేప పొడిలో ఒక స్పూన్ తేనేను కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయి.
వేప పొడి అనేది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం,
మధ్యాహ్నం భోజనం ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేప పొడిని కలిపి త్రాగితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
వేప ఆకులను నమిలిన లేదా పొడిగా తీసుకున్న సరే జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు నశించి జీర్ణాశయం శుభ్రం అవుతుంది. దీనితో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం,అల్సర్ వంటివి తగ్గిపోతాయి.
వేప ఆకులు కొన్నింటిని తీసుకుని బాగా నూరి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే తక్షణమే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.