రోజుకి 4 క్రాన్‌బెర్రీలు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Cranberry benefits in telugu

Cranberries Health Benefits in Telugu : క్రాన్‌బెర్రీని ఒక పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు ఎర్రగా ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలో మినరల్స్,విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువగా తీపి వంటల్లో వేస్తారు. వంటలకు మంచి రంగు,రుచి వస్తుంది. ఇప్పుడు క్రాన్‌బెర్రీ తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

క్రాన్‌బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

క్రాన్‌బెర్రీలో పాలిఫినాల్స్ సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ని పెంచటంలో చాలా సహాయపడుతుంది. అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు వంటి సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అందువల్ల గుండె వ్యాధులు ఉన్నవారికి క్రాన్‌బెర్రీ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

క్రాన్‌బెర్రీలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడి చర్మాన్ని తేమగా,కాంతివంతంగా ఉంచటంలో సహాయపడతాయి.

క్రాన్‌బెర్రీలలో ఉండే ప్రొ ఆంథోసయనిడిన్స్ సమ్మేళనాలు జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను తొలగించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
Share on Google Plus