Amla:రోజు ఒక ఉసిరికాయ తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో...

Amla health benefits


Amla Benefits In telugu :ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. సాదారణంగా ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయి. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయి. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి. 


రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఏ ఇతర పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర, పోషకాలున్నాయి.

ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.

హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. జుట్టు పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, జుట్టు  సంబంధిత అన్ని సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Share on Google Plus