Spices : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసులు.. ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయో తెలుసా..?

Masala dinusulu in Telugu


Masala dinusulu in Telugu:భారతీయ వంటల్లో సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఇతర దే శాలతో పోలిస్తే మన దేశంలో స్థూలకాయం సమస్య చాలా తక్కువ. అందుకు ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. స్థూలకాయంతో బాధపడేవారు ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

దాల్చినచెక్క
ప్రతి రోజు దాల్చినచెక్కను తీసుకొంటే అధిక బరువు,రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి,చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాక రక్తం గడ్డకుండా నిరోధిస్తుంది. దీనిని మోతాదుకు మించి తీసుకుంటే దానిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్‌కి హాని చేస్తుంది.

మిరపకాయ
మిరపకాయలో ఉండే క్యాప్సాసిన్ అనే రసాయనం కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఆకలి పుట్టించే గుణం కూడా ఉన్నది.

నల్ల మిరియాలు
పూర్వం ఆహారంలో మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినే ఉపయోగించేవారు. దీనిలో ఉండే పిపరిన్ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలు అందేలా చూస్తుంది. అలాగే శరీర బరువును సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

ఆవాలు
ఆవాలులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రొటీన్, కాల్షియం, నయసిన్ సమృద్ధిగా లభిస్తాయి.అందువల్ల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే అధిక రక్తపోటు తగ్గించడానికి కూడా ఆవనూనె చక్కగా పనిచేస్తుంది.

అల్లం
అల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్రవిసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. అంతేకాదు తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది. జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top