ముఖం ప్రకాశవంతంగా,అందంగా కనిపించటానికి మార్కెట్ లో అనేక రకాల క్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మన ఇంటిలో సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.
అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి,ఒక స్పూన్ పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం,మెడకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. జిడ్డు చర్మం కలవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ఒక దోసకాయ తీసుకోని దాని రసం తీసి దానిలో నాలుగు స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి బాగా పట్టించాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ ప్యాక్ స్వేద రంద్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాలతర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ చిట్కా పొడి చర్మం కలవారికి బాగాసహాయపడుతుంది.
అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే,ఒక ఎ,ఇ విటమిన్ టేబ్లేట్స్ పొడిని వేసి బాగా కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం మీద ఉండే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.