Fruits Ease Constipation:ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం వంటి అనేక రకాల కారణాలతో మలబద్ధకం సమస్య ఎక్కువగా వస్తుంది. మలబద్ధకం సమస్య కారణంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అలాగే మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఫైల్స్ సమస్య కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో మార్పులు చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే పండ్లను తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు
మలబద్ధకం సమస్యను తగ్గించడానికి అరటిపండు చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పేగు కదలికలను మెరుగుపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆరెంజ్ లో ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే బేది ముందు ప్రభావాలు ఉండటం వలన మలబద్ధకం సమస్యతో బాధపడేవారు అరేంజ్ తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
కివి లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఫైబర్, వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది, అలాగే కివిలో ఉండే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది.
బొప్పాయి పండు లో ఫైబర్ ఎక్కువగాను క్యాలరీలు తక్కువగాను నీటి శాతం ఎక్కువగాను ఉండటం వలన ప్రేగు కదలికలను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దాంతో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.