Dark Neck- మీ మెడ చుట్టూ నలుపా… అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే…!

Dark Neck Home Remedies In Telugu

Dark Neck :వాతావరణ కాలుష్యం, ఎండ, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో చర్మంనల్లగా మారుతుంది. ముఖ్యంగా ముఖం,మెడ భాగంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఫిగ్మింటేషన్ అని అంటారు.

ఈ సమస్య వస్తే ఒక పట్టాన తగ్గదు. ఇప్పుడు ముఖ్యంగా మెడ నలుపును తగ్గించుకోవటానికి సహజసిద్ధమైన పాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ పాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

గందం పొడిలో విటమిన్స్, న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉండుట వలన మెడ నలుపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గందం పొడిలో నీటిని కలిపి నలుపు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

కొబ్బరిపాలు మెడ నలుపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొబ్బరిపాలలో కాటన్ ముంచి మెడ నల్లని భాగంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్చే యాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top