Idli premix recipe :పప్పునానబెట్టే పనిలేదు రుబ్బే పనిలేదు ఈ పొడితో సాఫ్ట్ ఇడ్లీ

పప్పు రుబ్బుకునే పని లేకుండా వర్కింగ్ women కి ఇబ్బంది లేకుండా, మనం ఎప్పుడైనా జర్నీ చేసి వచ్చినప్పుడు ఇట్లా రకరకాలుగా ఇడ్లీ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కానీ మనకు  పప్పు నానబెట్టి రుబ్బుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ టైం మనం సేవ్ చేసుకోవాలంటే ఈ రకంగా instant రీమిక్స్ ని వాడి చూడండి.

చేసే విధానం:

ఒక కప్పు కి కొంచెం తక్కువగా మినప గుళ్ళు, లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. పొట్టు పప్పు కూడా తీసుకోవచ్చు. కలర్ మారకుండా చూసుకొని ఆఫ్ చేసి చల్లార  పెట్టుకోవాలి .ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుళ్ళని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పిండిని మళ్లీ జల్లెడ వేసుకోవాలి. మెత్తని పిండి కావాలి. 

ఇది ఒక కప్పు  పిండి వచ్చింది కదా. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పావు కప్పు అటుకులు తీసుకోండి. మిక్సీ జార్ లో వేసుకోండి .ఇది కూడా మెత్తగా ఆడేసి మినప పిండిలో కలుపుకోవాలి .ఇంకో రెండు కప్పులు ఇడ్లీ రవ్వ కూడా తీసుకొని దాన్ని కూడా  ఆ పిండిలో కలుపు కోవాలి. 

ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం రవ్వ, అటుకుల పిండి,  మినప్పప్పు పౌడర్ మూడు కూడా కలుపుకోవాలి. ఇది ఒక air tight కంటైనర్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని కలుపుకోవాలి. అలా ఈ పౌడర్ ని ఒక కప్పు పౌడర్ తీసుకొని ఒక కప్పు  వాటర్ కొంచెం కొంచెం గా కలుపుకుంటూ ఉండలు లేకుండా బ్యాటర్ తయారు చేసుకోండి. 

కొంచెం సేపు నాన పెట్టుకోండి. అవసరానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే 2 కప్స్ దగ్గర పెట్టుకొని ఆ బ్యాటర్ సరిపడా కలుపుకొని ఒక 10, 12 గంటలు నాన నివ్వాలి .అది కొంచెం పులిస్తే ఇడ్లీ బాగా వస్తాయి. ఒకవేళ ఇంతసేపు నాన పెట్టలేని పక్షంలో ఒక కప్పు పెరుగు వేసి కొంచెం సోడా కానీ eno కానీ కలిపేసుకుని వెంటనే వేసుకోవచ్చు. 

మనకి టైం ఉంది పరవాలేదు రుబ్బుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ పౌడర్ ని నానబెట్టుకోండి. నానబెట్టుకుని పొద్దున్నే వేసుకోండి. మామూలుగా ఇడ్లీ రేకులకి కొంచెం వాటర్ తడి చేసుకొని ఇడ్లీ పిండి వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి అంతే కానీ fermentize ఇడ్లీ ని వేసుకోండి eno, సోడా కలపకుండా ఉంటే  మంచిది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top