వేసవిలో మామిడి పళ్ళు తినాలని ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటాము. అలాగే నిల్వ ఉండడానికి కూడా ఇలా తాండరు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా బాక్స్ లోకి అదే స్నాక్స్ లోకి అలా పెట్టుకుని తింటూ ఉంటారు.
కావలసినవి:
మగ్గిన మామిడి పండ్లు , బెల్లం.
చేసే విధానం బెల్లం తో:
బంగిన పల్లి ముక్కలు మిక్సీ చేసి ఒక పాన్ తీసుకొని దాంట్లో మామిడిపండు గుజ్జుని వేసి తురిమిన బెల్లం కూడా వేసుకోండి. ఒక మూడు కప్పుల ప్యూరీకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. Flame లో టు మీడియం చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి.
ఎందుకంటే అడుగంటకుండా చుట్టూ అంచులు కూడా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి .మామిడి పళ్ళు చిన్న రసం అయితే పీచు ఉంటుంది, కాబట్టి బంగినపల్లి అయితే బాగుంటుంది ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ నిమ్మరసం, లైట్ గా ఇలాచీ వేసుకోవచ్చు మీ ఇష్టం.
మంచి texture కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యితో గ్రీస్ చేసుకొని అందులో మామిడి మిశ్రమాన్ని వేసుకోండి రెండు మూడు రోజులు ఎండనివ్వండి.