నోటి చుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే.........

Facial Exercise


Facial Wrinkles:ముఖం మీద ముడతలు లేనప్పటికీ కొందరికి నోటి చుట్టూ ముడతలు ఏర్పడతాయి. దీనికి వయస్సు ప్రభావం,వాతావరణ కాలుష్యం,సూర్య కిరణాలు... ఇలా కారణాలు ఏమైనా ముఖం అందాన్ని దెబ్బతీసే విషయంలో ముందు ఉంటాయి. అయితే ముఖం మీద చర్మం బిగువు సడలడమే దీనికి ఒక కారణం. ఇంట్లోనే కొన్ని పద్దతులను ఆచరించటం ద్వారా దీనిని నివారించవచ్చు.

గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి,దీన్ని ముడుతలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి,అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తే క్రమేపి ముడతలు తగ్గుతాయి.

టీ,కాఫీ లను తగ్గించి ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. ఈ పద్దతి వలన ఆరోగ్యంతో పాటు ముడతలను కూడా తగ్గించుకోవచ్చు.

ప్రతి రోజు పది,పన్నెండు గ్లాసుల నీటిని తప్పనిసరిగా త్రాగాలి. అలాగే రోజులో కొద్దిసేపైన మనసారా నవ్వటం అలవాటు చేసుకొంటే మంచి పలితాన్ని పొందుతారు.

కొన్ని చుక్కల ఆముదాన్ని ముడతలు ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దనా చేయాలి. ఇది చర్మం లోపలికి ఇంకిపోయే వరకు మర్దనా చేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ తేనే కలిపి ఈ మిశ్రమాన్ని నోటి చుట్టూ అప్లై చేయాలి. తేనెలోని పోషక విలువలు చర్మాన్ని ఆరోగ్యవంతముగా చేస్తాయి.

గ్రీన్ టీ పౌడర్,పెరుగు,తేనే,గ్రేప్ సిడ్ ఆయిల్ అన్నింటిని సమ భాగాలుగా తీసుకోని కలిపి ఈ మిశ్రమాన్ని నోటి చట్టు ఉన్న ముడతలపై అప్లై చేసి బాగా ఆరిన తర్వాత తీసివేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె,విటమిన్ E ఆయిల్ ను సమ భాగాలుగా తీసుకోని ఈ మిశ్రమాన్ని ముడతలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి. చర్మంలోకి బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top