Pimples:మొటిమలను తగ్గించటంలో నిమ్మకాయ ఎంత మాయ చేస్తుందో...?

నిమ్మరసంను డైరెక్ట్ గా ముఖం మీద రాస్తే మొటిమలకు కారణం అయిన దుమ్ము,ధూళి, మలినాలు చర్మ రంద్రాల ద్వారా బయటకు పోతాయి. ఇది మొటిమలనివారణకు అత్యంత సులభమైన మరియు సమర్థవంతమైన ఇంటి చికిత్సగా చెప్పవచ్చు.

కావలసినవి
నిమ్మకాయ - 1
నీరు - అవసరమైతే
కాటన్ బాల్ - 1
తేలికపాటి సబ్బు
ఒక చిన్న గిన్నె


పద్దతి
1. తేలికపాటి సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.
2. నిమ్మకాయను రెండు బాగాలుగా కోసి రసాన్ని ఒక గిన్నెలోకి తీయాలి.
3. ఈ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి.
4. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
5. ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.


గమనిక: నిమ్మరసంను డైరెక్ట్ గా చర్మానికి రాసినప్పుడు ఏమైనా చికాకులు ఉంటే మాత్రం వెంటనే ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే నిమ్మరసం రాసుకున్నాక ఎండలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top