Walnuts for Health: మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా చేసుకున్నారు. అలాంటి Dry Fruits లో వాల్నట్స్ ఒకటి. walnuts లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
walnuts కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్న దానికి తగ్గట్టుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకి రెండు వాల్నట్స్ నీటిలో 5 గంటల పాటు నానబెట్టి పై తొక్క తీసి తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
వాల్నట్స్ నానబెట్టి తినటం వలన వాటిలో ఉన్న పోషకాలు 100% మన శరీరానికి అందుతాయి. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి ఆకలి లేకుండా చేస్తుంది. అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. వాల్ నట్స్‌లో ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్ లేదా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి క్యాల్షియంను ఎక్కువగా గ్రహించి బోన్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి.