Mango Sambar rice:కమ్మనైన మామిడికాయ సాంబార్ రైస్ అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది

మామిడికాయ సీజన్ ఏమాత్రం వదలం కదండి. మామిడికాయతో  ఆవకాయ పచ్చడి ,మాగాయ, పులిహోర ఇలా చాలా రకాలు చేసుకుంటాం కదా.. అలాగే సాంబార్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. చింతపండు ఎక్కువగా వాడకూడదు అని అనుకుంటాం కానీ తప్పదు. Armchur తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా instant గా ఈ సీజన్లో మామిడికాయ ముక్కలు చేసుకోవచ్చు ఇలా కూడా ఒకసారి చేయండి.

కావలసినవి:

ఒక కప్పు బియ్యం ,కందిపప్పు, మామిడికాయ సగం ముక్కలు, ములక్కాడ ముక్కలు, టమాటో,  కొత్తిమీర, ఇష్టమైన వెజిటేబుల్ add చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ,ఇంగువ ,పసుపు ,కారం, ఉప్పు.

చేసే విధానం:

ఒక కుక్కర్ లో ఒక కప్పు బియ్యం, ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని రెండు బాగా శుభ్రంగా కడగండి. ఐదు కప్పులు నీళ్లు, పావు స్పూన్ పసుపు, ఒక్క స్పూన్ నూనె వేసి ఒక గంట సేపు నాన పెట్టుకోండి. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఆఫ్ చేయండి. 

ఈలోపు చేయాల్సినవి చూద్దాం ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ,ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, అర స్పూను జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, మూడు పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, మూడు టమోటాల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి.. 

ఒక పెద్ద మామిడికాయని తీసుకొని కొంచెం పెద్ద ముక్కలు సగం వేసుకోవచ్చు. అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, అర స్పూను ఉప్పు తగినంత సరిపడా చూసుకొని మళ్లీ వేసుకోవచ్చు. చింతపండు లేకుండా మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా చింతపండు వేయనవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. 

రైస్ కుక్కర్ మూత తీసి ఉడికింది లేనిది కన్సిస్టెన్సీ చూసుకోండి.  గరిటకి కొంచెం జారుగా ఉండేలా ఉంటే బాగుంటుంది. ఉడికిన ఈ రైస్ ని ముక్కల్లో వేసి బాగా కలపాలి .అది దగ్గర పడేంత దాకా ఉంచకుండా కొంచెం జారుగానే తీసేయండి. ఎందుకంటే కాసేపటికి అది గట్టిగా వస్తుంది. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది .పిల్లలు కూడా తింటానికి ఇష్టపడతారు .ప్రసాదంలా కూడా బావుంటుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top