ఎలాంటి ఇంగ్రిడియంట్స్ అవసరం లేదు. పప్పులు నానబెట్టుకుని అవసరం లేదు. ఈ స్పెషల్ instant సాంబార్ బ్రేక్ ఫాస్ట్ - ఇడ్లీ ,పొంగల్, దోస వాటిలోకి టేస్టీ టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు.
కావలసినవి:
ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,టమాటో, ఉప్పు, పసుపు ,కారం ,ధనియాల పొడి, కరివేపాకు, శెనగపిండి, నెయ్యి, నూనె.
చేసే విధానం:
ప్రెషర్ కుక్కర్ లో రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు అవి కూడా చీలికలు చేసుకోవాలి. నాలుగు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకోండి. పది వెల్లుల్లి రెబ్బలు ,ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ కారం, పావు స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసి, ఒక కప్పు వాటర్ పోసుకోండి.
మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత మూత తీసి టమాటోస్ మగ్గిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఆ వాటర్ ని పక్కన గిన్నెలోకి డ్రైన్ చేసుకోండి. వాటర్ పక్కన పెట్టిన తర్వాత ఇవి చల్లారిన వాటిని మిక్సీ జార్ లో 7 వెల్లుల్లి రేఖలు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఇంగువ, గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకొని అందులో , టమాటో ఉల్లిపాయ pury ఉంది కదా అది కూడా దాంట్లో వేసుకోండి.
పక్కన వాటర్ కూడా అందులో కలిపేసుకుని అవసరానికి ఇంకొంచెం వాటర్ కలుపుకోండి. పల్చదనం చూసుకొని ఇప్పుడు వేరే బౌల్లో ఒక రెండు స్పూన్ల శెనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. అది కొంచెం జారుగా ఉండేలా చూసి దాన్ని కూడా ఆ సాంబార్లో ఆ వాటర్ లో కలిపేసుకోండి.
శనగపిండి వేసిన తర్వాత కొంచెం మరగనివ్వండి. ఈ consistency శనగపిండి వల్ల చిక్కగా అయ్యే అవకాశం ఉంటుంది. batter కి సరిపడా చూసుకొని, సూప్ లాగా thick గా ఉంటే బాగుంటుంది. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కొత్తిమీర వేసుకొని stove ఆఫ్ చేసేయండి అంతే టమాటో సాంబార్ రెడీ అయిపోయింది.