finger white spots: మీ చేతి గోరు మీద తెల్లటి మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు ?


finger white spots


finger white spots : మనలో చాలా మందికి చేతి వేళ్ళ గోర్లపై తెల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్స్ ఒక వ్యక్తి యొక్క గోళ్ళు చూసి ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తూ ఉంటారు. కొంత మంది గోర్లు పెళుసుగా ఉంటాయి. ఇలా గోర్ల మీద మచ్చలు ముందుగా మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరుపై అనుమానించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం.

కొంతమంది గోర్లకు దెబ్బలు తగిలిన, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా గోర్ల పై తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో జింక్, కాల్షియం లోపం ఉన్న గోర్ల మీద మచ్చలు ఏర్పడతాయి. అప్పుడు జింక్, కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే మచ్చలు తగ్గుతాయి.

కొంతమందిలో గోర్ల మీద ఇలా మచ్చలు కనిపిస్తే, దానికి కారణం గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అంతేకాదు నోటి దుర్వాసన, న్యూమోనియా, సొరియాసిస్ వంటి వ్యాధులకు గుర్తు ఈ గోర్ల మీద మచ్చలని వైద్యులు సూచిస్తున్నారు.

గోర్ల మీద తెలుపు మచ్చలు కనిపిస్తే, జీర్ణశయాంతర అంటు వ్యాధులు, అజీర్ణము, ఇతర అనారోగ్య లోపాలు సహా అనేక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కసారి గోర్ల మీద మచ్చలు ప్రోటీన్ లోపం వలన కూడా ఏర్పడతాయి. జుట్టు ఊడిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. గోర్లు పేలుసుగా మారుతాయి.

కొంతమందిలో ఆర్సినిక్ పాయిజనింగ్ అయిన అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అయితే ఇలా గోర్ల మీద మచ్చలు పెద్దగా, ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ నీ సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.
Share on Google Plus