పట్టు లాంటి మెరిసే జుట్టు మీ సొంతం కావాలంటే....

Hair Tips :జుట్టుకి మంచి చేసే వాటిలో మెంతి ముందు ఉంటుంది. దీనిలో ఉండే నికోటిక్ ఆమ్లం జుట్టు పెరగటానికి సహాయపడుతుంది. మెంతిలో ఉండే విటమిన్స్,ఖనిజాలు జుట్టును తేమగా ఉంచుతాయి. మెంతిలో ఉన్న ప్రత్యేక గుణాలు జుట్టుకు పోషణను ఇస్తాయి.

మెంతి గింజలను నీటిలో ఐదు గంటలు నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. దానికి రెండు చెంచాల కొబ్బరి పాలు కలిపి తలకు రాసుకోవాలి. అరగంట అయ్యాక తక్కువ ఘాడత కలిగిన షాంపు తో శుభ్రం చేసుకోవాలి.

కుంకుడుకాయల వలన మాడుపై ఉన్న ఇన్ ఫెక్షన్స్ తొలగిపోతాయి. కుంకుడు కాయలను ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడికి సీకాయ పొడిని కలిపి, దీనికి వేడి నీటిని చేర్చి వారానికి రెండు సార్లు తల రుద్దుకుంటే,పట్టు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

ఉల్లి,వేల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. రెండింటి నుంచి రసాన్ని తీసి మాడుకు రాసి, అరగంట తర్వాత తక్కువ ఘాడత కలిగిన షాంపూ తో శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top