Hair Loss:వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Hair Loss Home Remedies In telugu:మారిన జీవనశైలి, ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. 

వీటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ ఇంటి చిట్కాను ఫాలో అయితే జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో తగ్గించుకోవచ్చు. మిక్సీ జార్ లో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కను కట్ చేసి వేయాలి. 

ఆ తర్వాత కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. ఈ పేస్టుని పలుచని వస్త్రం సాయంతో జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ ఆముదం, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదా ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి.  ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత హెర్బల్ షాంపు లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. 

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ, అల్లం లో ఉండే పోషకాలు చుండ్రు,దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గటానికి ఈ చిట్కా చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top