cucumber:వేసవిలో కీర దోసకాయ తింటే ఎన్నో ప్రయోజనాలు..అసలు నమ్మలేరు

cucumber Health Benefits In Telugu : వేసవికాలం ప్రారంభం అయింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరాన్ని చల్లగా ఉంచేలా ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని రకాల కూరగాయలను తీసుకుంటే వేసవి కాలంలో డిహైడ్రేషన్ సమస్య లేకుండా ఉంటుంది. 

అలాంటి కూరలలో కీరా దోసకాయ ఒకటి. వారంలో  రెండు లేదా మూడు సార్లు కీర  దోసకాయను తింటే శరీరం లోపల నుంచి చల్లగా ఉంచుతుంది. అలాగే నిర్వీకరణ చేస్తుంది. కీరదోసకాయలో దాదాపుగా 95 శాతం వాటర్ ఉంటుంది. 

శరీరంలో విషాలను బయటకు పంపడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషణ అందిస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణసంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కీరదోస కాయను ముక్కలుగా కట్ చేసి మిరియాల పొడి  చల్లుకొని తినవచ్చు... లేదంటే juice చేసుకొని తాగవచ్చు.

కీర దోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. వేసవి కాలంలో వచ్చే నీరసం, అలసట, నిస్సత్తువ  వంటి వాటిని తగ్గించడంలో కీరా దోస చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ వేసవిలో కీర దోసకాయలను తినడానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Share on Google Plus