
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కలబంద ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఒక కప్పు ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మిక్సీ జార్ లో కలబంద ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. ఈ పేస్ట్ నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ ఆవనూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఈ చిట్కాలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే తెల్ల జుట్టు సమస్య ప్రారంభంలో ఉన్నవారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.