వడియాల్లో ఎన్ని రకాలు పెట్టుకున్న ఇంకా వెరైటీ కావాలనే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచింగ్ అనేది అందరూ ఇష్టపడతారు. Fryans లో రకరకాలు కూడా తెచ్చుకుంటారు. అలాగే రాగి పిండితో కూడా ఈ వెరైటీ వడియాల్ని చూసి ఎంజాయ్ చేయండి.
చేసే విధానం:
ఒక ప్లేట్లో ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. మిక్సీ జార్ లో ఒక ప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత అది సన్న పౌడర్లా అవుతుంది కదా ఆ పౌడర్ ని రాగి పిండిలో కలుపుకోండి. రెండిటిని బాగా కలుపుకోండి. రెండు కప్పుల నీళ్లు తీసుకొని ఒక్క కప్పు ముందు పోసి కలిపి ఉండలు లేకుండా చూసుకొని, అప్పుడు మళ్ళీ ఇంకొక కప్పుతో పోసుకొని ఒకేసారి పోస్తే బాగా ఉండలు ఉండలు అయిపోతుంది.
రాగి పిండికి మెత్తగా ఉంటుంది. మిక్సీ జార్ లో మూడు పచ్చిమిర్చి, ఒక ఇంచ్ అల్లం ముక్కని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి . ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 9 కప్పులు నీళ్లు తీసుకోండి. రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 9 కప్పులు నీళ్లు తీసుకోండి.
కొద్దిగా సాల్ట్, కారంలో వేసాం ఇందులో కూడా కొంచెం వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర, పావు కప్పు నువ్వులు పచ్చివి, పచ్చిమిర్చి పేస్ట్, ఆఫ్ స్పూన్ ఇంగువ వల్ల కూడా టేస్ట్ వస్తుంది బాగుంటుంది. ఇవన్నీ మరిగే నీళ్లలో వేసుకోండి. ఈ మరిగే నీళ్లలో రాగి పిండి సగ్గుబియ్యం పొడి కలిపిన పేస్టు ఉంది కదా అది కూడా ఈ నీళ్లలో వేసి ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోండి.
పిండిని బాగా ఉడికించుకోవాలి. లేదంటే వడియం విరిగిపోతుంది. బాగా దగ్గరకి చిక్కగా వచ్చేలా చూసుకోండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం బ్యాటర్ ని గమనించి తీసుకోండి. ఒక cotton క్లాత్ తీసుకొని చిన్న గరిటతో ఒక్కొక్క గరిటె వడియాలు అంటుకోకుండా చక్కగా పెట్టుకోండి.
ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి. ఎండలో పెట్టాలనుకుంటే ఎండలో పెట్టుకోండి. ఆరిపోయిన వడియాలు క్లాత్ మీద water జల్లి తీసుకొని, తర్వాత రెండు రోజులు ఒక పళ్ళెంలో వేసి ఎండలో పెట్టుకోండి. ఎండిపోయిన వడియాలు బాగా నూనె కాగిన తర్వాత నూనెలో వేస్తే బాగా పొంగుతాయి. టేస్ట్ కి టేస్ట్ క్రిస్పీ అండ్ హెల్దీ కూడా.