saggubiyyam payasam:ఒంటికి చలువచేసే కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఇలాచేస్తే రుచి అదిరిపోతుంది

సమ్మర్ లో సగ్గుబియ్యం చలవ చేస్తాయి, పెసరపప్పు కూడా వేడి తగ్గించి చలవ చేస్తుంది, సో ఆ రెండిటితో పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది ప్రసాదంగా కూడా బావుంటుంది.

కావలసినవి: 

సగ్గుబియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు ,నెయ్యి ,ఇలాచీ పౌడర్, జీడిపప్పు ,కిస్మిస్.

చేసే విధానం:

అరకప్పు సగ్గుబియ్యం తీసుకుని బాగా శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అర కప్పు పెసరపప్పు ఒక బాండీలోకి తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కమ్మని వాసన వచ్చేవరకు కలుపుతూ వేయించుకోవాలి. కలర్ చేంజ్  అవగానే , రెండు కప్పుల నీళ్లు తీసుకొని పెసరపప్పును ఉడికించుకోవాలి. 

మీడియం ఫ్లేమ్ లో  - త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరొకపక్క ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసుకుని ,ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి (సగ్గుబియ్యం ఉడికేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి) వాటర్ తో సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. 

అలాగే ఇంకొక పక్క  ఒకటిన్నర కప్పు బెల్లము, అర కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. కరిగితే సరిపోద్ది పాకం రానవసరం లేదు. కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కుక్కర్ మూత తీసి కొంచెం స్మాష్ అంటే కొద్దిగా పలుకు కనిపించేలాగా చేసుకోండి మరీ మెత్తగా పప్పులాగా చేయినవసరం లేదు. 

అందులో సగ్గుబియ్యం కూడా transparent గా ఉడికింది లేనిది చూసుకొని ,ఉడికిన తర్వాత ఆ సగ్గుబియ్యం తీసుకొని  ఉడుకుతున్న పెసరపప్పులో వేసి కలుపుకోండి. ఇందులో బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా ఆ సిరప్ ని కూడా ఫిల్టర్ చేసుకొని పెసరపప్పు సగ్గుబియ్యం లో వేసుకోండి. ఒక్క ఉడుకు  రానిచ్చి, నాలుగైదు ఇలాఛి, పౌడర్ చేసి వేసుకోండి. 

స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు పాటు మూత పెట్టి ఉంచుకోండి. అంతలో పక్కన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక బాండీలో జీడిపప్పు ,కిస్మిస్ వేయించుకోండి. ఒక పక్కన  కప్పు పాలు కాచి చల్లార్చి పెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యం పెసరపప్పు కూడా చల్లారిన తర్వాతే కొంచెం పాలు పోసి కలపండి. 

తర్వాత మొత్తం అన్ని పాలు పోసి కలపండి. విరిగిపోకుండా ఉంటాయి .ఇందులో వేయించిన జీడిపప్పులు కూడా వేసుకొని, కొంచెం వేడిగా కావాలి అనుకుంటే, దగ్గర పడాలి అనుకుంటే ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. అంతేనండి చాలా రుచిగా ఉంటుంది చేసి చూడండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top