Health Tips:పరగడుపున ఒక స్పూన్ నువ్వులను 7 రోజుల పాటు తింటే ఏమవుతుందో తెలుసా?

Sesame seeds health benefits In Telugu

Sesame seeds :నువ్వులలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలిసిన విషయమే. నువ్వులను వంటల్లో వాడితే వంటకు మంచి రుచి వస్తుంది. నువ్వులలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు బలహీనం కాకుండా బలంగా ఉంచటానికి మరియు కండరాల పటుత్వానికి బాగా సహాయపడుతుంది. నువ్వులలో మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లు సమృద్ధిగా ఉంటాయి.

రోజు ఒక స్పూన్ నువ్వులను తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అంతేకాక రక్తంలో చెడు కొలస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. అలాగే ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తినటం వలన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ప్రతి రోజు నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు కూడా తగ్గిపోతారు.

నువ్వులలో ఉండే లిగ్నిన్స్ కారణంగా విటమిన్ E ని అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వృద్దాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది. అంతేకాక అనేక వ్యాధులకు కారణం అయినా ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేస్తుంది.

పాలల్లో కన్నా నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్టియో ఫ్లోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నువ్వుల్లో ఉండే కాపర్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాస్త బలహీనంగా ఉన్నవారు ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తింటే శరీరం బలంగా మారుతుంది. నువ్వులలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తుంది. నువ్వులు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top