రసం పౌడర్ మనం బయటకొనే ప్యాకెట్లు వాడకుండా ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది టేస్ట్ గా కూడా ఉంటాయి.
ఒక పాన్ తీసుకొని ఒక కప్పు ధనియాలు వేసి బాగా పొడిగా దోరగా వేయించుకోండి. అవి పక్కన పెట్టుకోండి .మళ్లీ అదే కప్పుతో కందిపప్పు తీసుకోండి. కొంచెం కలర్ వచ్చేసరికి కొంచెం వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు అవి కూడా తీసి ధనియాల పళ్లెంలోకి వేసుకోండి.
ఒక స్పూను మెంతులు కూడా దోరగా వేయించి, పావు కప్పు జీలకర్ర ,పావు కప్పు మిరియాలు, వేగించుకున్నాక వీటిని కూడా ఆ పళ్ళెంలో తీసుకోండి. ఒక 15 ఎండు మిరపకాయలు కూడా వేగించుకొండి. అవి కూడా పక్కన పెట్టుకోండి .
ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి. వీటన్నింటినీ జార్లో వేయండి, చల్లారిన తర్వాత పసుపు ,ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసి మిక్సీలో బాగా మెత్తగా పొడి చేసుకోండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లో వేసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే సాంబార్ రసం పౌడర్లు రెడీ.