ప్రీమిక్స్ ఊతప్పం పౌడర్ ఎప్పుడంటే అప్పుడే instant గా పప్పులు నానబెట్టి చేసుకోకుండా అప్పటికప్పుడు కలిపి వేసుకునే ఊతప్పం ఎలాగో చూసేద్దాం రండి.
కావలసినవి:
మినప గుళ్ళు, పచ్చిశనగపప్పు, మెంతులు, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ.
చేసే విధానం:
ముప్పావు కప్పు మినప గుళ్ళు, పావు కప్పు పచ్చ శనగపప్పు, low flame లో వేపుకోండి .ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి వేపాలి. వాటిని ఒక పళ్ళెంలో తీసుకొని చల్లార పెట్టుకోండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పిండిని జల్లెడ పట్టి వేసుకున్న, తర్వాత మళ్లీ సెకండ్ టైం కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో రెండు కప్పుల బియ్యప్పిండి , అర కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి చేతితో మొత్తం అన్ని powder కలిపే లాగ కలుపుకోవాలి .ఈ పిండిని ఒక air tight కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇదే premix ఊతప్పం పౌడర్ ఇప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉతప్పం వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక కప్పు పౌడర్ ని వేసుకొని ,ఒక అర కప్పు పెరుగుని వేసి, కొంచెం వంట సోడా, అంటే అర టీ స్పూన్లు సగం. వేసి బాగా చేతితో కలిపి తర్వాత కొంచెం వాటర్ తోటి కలుపుకోండి.
గరిట వేస్తే జారెలా ఉండే బెటర్ లో ఉంటే చాలు... ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నూనె గ్రీస్ చేసుకొని ఒక్క గెరిట పిండి వేసుకొని దానిపైన నచ్చిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర ,కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మళ్ళీ వేరొక వైపు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే చక్కగా మెత్తగా వస్తాయి. ఇవి మనం breakfast ప్లాన్ లేనప్పుడు , సైడ్ dish లా ఈజీగా వేసుకోవడానికి బాగుంటాయి.