సాంబార్ పౌడర్ మనం బయటకొనే ప్యాకెట్లు వాడకుండా ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది, టేస్ట్ గా కూడా ఉంటాయి.
సాంబార్ పౌడర్
ఒక పాన్ లో అర స్పూన్ మెంతులు దోరగా వేయించుకోండి. అవి ఎర్రగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ,రెండు టేబుల్ స్పూన్ల మినప మినపగుళ్ళు, రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ,ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలు, కూడా వేసి అన్నీ కూడా వేపుకోవాలి .
ఎంత దోరగా వేగితే అంత టేస్ట్ గా ఉంటుంది. రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక కప్పు ధనియాలు వేయించుకోoడి. అవి వేపిన తర్వాత ఒక 30 ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి.
అవి కూడా పక్కన పెట్టుకొని, మళ్ళీ ఒక అరకప్పు కరివేపాకు కూడా తీసుకొని వేగించుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి గ్రైండ్చెయ్యండి. రెండు స్పూన్ల ఇంగువ కూడా వేసుకోండి. పౌడర్ చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి.