Rava Chips:ఎంతోఈజీగా రవ్వతో ఇలా చిప్స్ చేసుకోండి కరకరలాడుతూ చాలారుచిగా ఉంటాయి

మైదాని avoid చేస్తున్నాం కదా, మైదా బదులు గోధుమపిండి, ఇప్పుడు suji రవ్వ తోటి కరకరలాడే చిప్స్ ఎలా చేయాలో చూద్దాం.  ఇవి స్నాక్స్ లోకి టీ టైంలోకి చాలా బాగుంటాయి.

కావలసినవి:

బొంబాయి రవ్వ, ఎండు మిరపకాయలు, ఉప్పు ,కరివేపాకు, వాము.

చేసే విధానం:

రెండు కప్పుల బొంబాయి రవ్వని మిక్సీ జార్ లో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మెత్తగా రాదు గాని లైట్ గా బరకగానే ఉంటుంది. దాంట్లో మూడు ఎండుమిర్చిని తుంపి వేసుకోండి.  ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో  పోసుకోండి. అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ వాము సన్నగా తురిమిన కరివేపాకు, కొత్తిమీర,వాము లేదా జీలకర్ర  వేసుకోవాలి.

ఇందులో నెయ్యి, నూనె  ,వెన్న ఏమీ అవసరం లేదు. మామూలుగా వాటర్ తో కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. రవ్వ ఎక్కువగా నీళ్ళని observe చేస్తుంది. కాబట్టి బాగా కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి. కొంచెం సాఫ్ట్ గా  అయ్యేవరకు కలుపుకుంటే కాసేపు నాన పెట్టండి . నానబెట్టినప్పుడు  అది కాస్త  గట్టిపడుతుంది. 

అంతా కలిపిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ముద్దకి పట్టించండి. ఒక తడి బట్టని ఆ పిండి మీద వేసుకోండి. ఒక అరగంట పాటు నాన నివ్వండి మళ్లీ మర్దన చేస్తూ ఇంకొకసారి కలుపుకోండి. గట్టిగా అనిపిస్తే ఒక్కసారి తడి చేసుకోండి. ఒక చపాతీ సైజు ముద్దని తీసుకొని మిగతా దాన్ని తడి బట్ట పెట్టి పక్కన పెట్టేసుకోండి. 

చపాతీ లాగా కొంచెం బియ్యప్పిండి గాని గోధుమపిండి గాని ఏదైనా పొరుపు పెట్టుకొని కొంచెం మందంగా మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా చపాతీలా చేసుకోవాలి. ఈ రోల్ చేసిన చపాతీని వెనక వైపుకి తిప్పి అప్పుడు  కావాల్సిన షేప్ లో చిప్స్ ని కట్ చేసుకుంటే కింద అంటుకోకుండా బాగా వస్తాయి. 

పక్కన  డీప్ ఫ్రై కి సరిపడా నూనెని పెట్టుకొని కటింగ్ చేసిన chips ఒక వాయికి సరిపడా కట్ చేసుకున్నాక,  మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం సేపు ఆగిన తర్వాత కదుపుతూ వేగించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగించుకొని  తీసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని తీసుకోండి. 

వేసేటప్పుడు, తీసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. వెంటనే  కదపకండి. వాటికవే విడిపోతూ ఉంటాయి. అంతేనండి కరకరలాడే సుజి చిప్స్ రెడీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top