గోధుమపిండితో చపాతీలు ఒక్కొక్కసారి బోర్ కొడుతూ ఉంటాయి. లేదా వేడి చేస్తాయి. అలాంటప్పుడు జొన్న రొట్టెలు కూడా చాలా ఆరోగ్యం... కాబట్టి ఇవి కూడా మధ్య మధ్యలో చేసుకోండి. రోజు తిన్నా ఆరోగ్యానికి మంచిది.
చేసే విధానం:
ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి .దాంతోపాటు ఒక కప్పు జొన్న పిండి కూడా వేసుకోండి. పిండిని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆ నీళ్ల వేడిలోనే ఈ పిండిని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూను గాని, గరిటగాని, తీసుకొని దాంతో కలుపుకోవాలి.
మన చేయి పట్టగలిగిన వేడిని చూసుకొని చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి . అంతా కలిపాక ఒకపక్కగా అదిమి పెట్టుకోవాలి .అప్పుడు తేమ అరకుండా ఉంటుంది. చిన్న ముద్దలుగా తీసుకొని వాటిని మర్దన చేసుకుని బాగా ముద్దని కలుపుకోవాలి .ఎంత మర్దన చేస్తే అంత సాఫ్ట్ గా వస్తాయి.
క్రాక్స్ లేకుండా రౌండ్ గా సాఫ్ట్ గా ముద్దలాగా చేసుకుని దాన్ని చపాతీ పిండి లాగా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకొండి. పెనం పెట్టుకొని జొన్న రొట్టెను వేసి కొంచెం క్లాత్ తో ఒత్తుకుంటుంటే పొంగుతుంది. రెండు వైపులా కాల్చుకొని తీసేయొచ్చు. ఇవి ఎంతసేపైనా మెత్తగానే ఉంటాయి.
వేడినీళ్లతో మగ్గించాం కాబట్టి మెత్తగా ఉంటాయి. చేతితో వత్తాలి అంటే చాలా కష్టం కాబట్టి ఇలా చేసుకుంటే పిండి మెత్తబడి మనం చపాతీల్లాగా ఒత్తుకుంటూ ఉండొచ్చు. కొంచెం పొరుపుకి జొన్న పిండి వేసుకొని కావలసినంత రౌండ్ గా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి.