Mamidikaya Pulihora Paste:ఇలా పేస్ట్ చేసిపెట్టుకుంటే ఎప్పుడుకావాలంటే అప్పుడు పులిహోర రెడీ


సమ్మర్లో మామిడికాయలు బాగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం రకరకాలుగా ఆవకాయ, పప్పుచారు ,పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటాo. చింతపండుతో పులిహార ఎప్పుడు చేసుకుంటాం, కానీ మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయ పులిహార చేసుకుంటే చాలా బాగుంటుంది. అది  ప్రతిసారి కష్టపడకుండా ఒక రెండు నెలలు స్టోర్ చేసుకునే విధానం చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు.

కావలసినవి:

ఐదు కప్పుల మామిడికాయ తురుము, కప్పు పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ కరివేపాకు.

చేసే విధానం:

నాలుగు పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచేసుకోని, శుభ్రంగా చెక్కు తీసేసి ,క్యారెట్ తురిమినట్టుగా సన్నగా పొడుగ్గా చక్కగా తురిమేసుకోవాలి. రెండు గంటల పాటు ఎండలో గాని ఫ్యాన్ కింద గాని ఆరబెట్టేసుకోండి .ఇక్కడ మొత్తం ఐదు కప్పుల మామిడి తురుము వస్తుంది. 

ఇప్పుడు ఒక బాండీలో ఒక కప్పు నూనె పోసుకొని, నూనె కాగిన తర్వాత ఒక అర కప్పు పల్లీలు వేగించుకోవాలి. ఒక స్పూను ఆవాలు ,రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినప గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి. 20 పచ్చిమిరపకాయల్ని తడి లేకుండా  ఎగించుకోండి .

15 ఎండు మిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి , ఇప్పుడు  మామిడి తురుమును కూడా ఈ పోపుల్లోనే వేసి బాగా కలుపుకొని ఏగనించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఉంచి నూనెను వదిలే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి . ఒక కప్పు నూనె తీసుకున్నాం కదా ఇంకొక అరకప్పు కూడా వేసుకోండి.

 రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసి మరి కొంచెం సేపు వేపుకోవాలి. నూనె వదిలేస్తున్నప్పుడు , స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లార పెట్టుకోండి. చల్లారిందాన్ని ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి . Fridge లో కూడా రెండు నెలలు వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి రైస్ కి కలుపుకుంటే చాలా బాగుంటుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top